ఇద్దరు బాలికలు మిస్సింగ్... కేసు నమోదు...
NDL: అవుకు పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు కొలిమిగుండ్లలో మిస్సింగ్ అయినట్లు ఈరోజు పోలీసులకు సమాచారం అందింది. మానస, మనీషా, అనే బాలికలు కొలిమిగుండ్ల గ్రామం సమీపంలో ఉన్న అక్కదేవతల గుడి వద్దకు దర్శనానికి వెళ్లారు. అక్కడ కనిపించకపోవడంతో బాలికల తండ్రి మద్దిలేటి కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.