లక్ష్మీ బ్యారేజీలో కొనసాగుతున్న వరద ప్రవాహం

BHPL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 90,330 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 75,550 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా సాయంత్రానికి 15 వేల క్యూసెక్కులకు పైగా వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం ఉదయం అంతే వరద ప్రవాహం నెలకొంది.