పినపాకలో పులి సంచారం
BDK: పులుల ఆవాసం, తోడు కోసం నెలల తరబడి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళుతుంటాయని ఎఫ్తార్డి అధికారి తేజస్విని తెలిపారు. శుక్రవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్డులోని అటవీ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పులుల సంఖ్యను తెలుసుకునేందుకు ప్రభుత్వం నాలుగేళ్లకోసారి గణన చేపడుతుందన్నారు. జీపీఎస్ మ్యాప్ ద్వారా మండలంలో పులి సంచార వివరాలను ఆమె వివరించారు.