శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవం
VZM: జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో బొండాడ వీధిలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణం జరుపబడునని అధ్యక్షులు బంగారు దేవుళ్ళు తెలిపారు. బ్రహ్మశ్రీ లక్కోజు ఓంకార్ ఆచార్య సిద్ధాంతిచే ఈ కళ్యాణం జరుపనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు.