నేడు లోక్‌సభలో ఢిల్లీ కాలుష్యంపై చర్చ

నేడు లోక్‌సభలో ఢిల్లీ కాలుష్యంపై చర్చ

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రస్థాయికి చేరి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుంది. విపక్షాల నుంచి ప్రియాంకా గాంధీ, కనిమొళి, డింపుల్ యాదవ్ చర్చ ప్రారంభించనున్నారు. బీజేపీ తరపున చర్చలో నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్ పాల్గొననున్నారు.