ద్విచక్ర వాహనంపై నుండి జారిపడ్డ మహిళ

SKLM: టెక్కలి మండలం సాకిపల్లి కొత్తూరు గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ స్పృహ తప్పి రోడ్డుపై జారీ పడిపోయింది. అదే సమయంలో అటుగా కారులో వెళుతున్న పలాసకు చెందిన పినకాన సాయికుమార్ కారు ఆపి, ఆ మహిళకు సపర్యలు చేసి.. టెక్కలి ఆసుపత్రికి తరలించారు. ఆయన చేసిన ఈ సహాయానికి స్థానికులు అభినందించారు.