ఉత్సవాలకు ముందే.. తొలి విగ్రహం నిమజ్జనం

HYD: వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌నగర్‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గూడకు చెందిన మండప నిర్వాహకులు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్‌నగర్‌లో కేబుల్స్‌కు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ఆ విగ్రహాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.