అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు : ఏడీఏ

అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు : ఏడీఏ

అన్నమయ్య: పీలేరు వ్యవసాయ శాఖ ఏడీఏ రమణారావు సోమవారం ములకలచెరువు మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.అమ్మకాలు, కొనుగోళ్లు, రికార్డులు, స్టాక్ నిల్వలను పరిశీలించారు. రైతులు, వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనుమతి లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.