సంతల ఆదాయం రూ.3.40 లక్షలు
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శని, ఆదివారం నిర్వహించిన వార సంతల ద్వారా మొత్తం రూ.3,40,350 ఆదాయం సమకూరింది. ఇందులో గొర్రెలు, మేకల సంత నుంచి రూ.2,08,550, పశువుల సంత నుంచి రూ.1,31,800 ఆదాయం వచ్చిందని యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. ఈ మొత్తాన్ని సోమవారం ప్రభుత్వ ఖజానాకు జమ చేయనున్నారు.