సర్పంచ్ ఎన్నికలు.. ఏకగ్రీవాల రద్దుకు డిమాండ్
HYD: సర్పంచ్ ఎన్నికల్లో రాజ్యాంగ విరుద్ధమైన ఏకగ్రీవాలు రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రజల ఓటు హక్కును నిరాకరించకుండా నోటాను ఒక అభ్యర్థిగా పరిగణించి ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో స్థానిక ప్రభుత్వాల సాధికారత వేదిక నాయకులు సమావేశం అయ్యారు. డబ్బు, మద్యానికి ఆశపడి ఓటు వేయొద్దన్నారు.