VIDEO: బోనాలకు ముస్తాబైన ముత్యాలమ్మ దేవాలయాలు

SRPT: తుంగతుర్తితో పాటు మండల వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ కావడంతో ముత్యాలమ్మ, ఇంద్రవెల్లి ముత్యాలమ్మ, ఊరు ముత్యాలమ్మ దేవాలయాలు ముస్తాబయ్యాయి. రజకులు ఆలయాలను శుభ్రం చేసి కుంకుమ, పసుపులతో అమ్మవార్లను అలంకరించారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పల్లెల్లో బోనాల పండుగ శోభ సంతరించుకుంది.