VIDEO: అగ్ని ప్రమాదాలపై కార్మికులకు అవగాహన
PLD: దాచేపల్లి మండలం దుర్గాపురంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎలా నివారించాలో కార్మికులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జోనల్ ఆఫీసర్ జిలానీ, జిల్లా అధికారి శ్రీధర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.