'లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి'

'లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి'

W.G: ఈనెల 13వ తేదీన జరగబోతున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీ నారాయణ అన్నారు. గురువారం భీమవరంలో పోలీస్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయం మాట్లాడారు. ఎక్సైజ్ కేసుల్లో నిబంధనలకు లోబడి కేసును రాజీ చేసుకునే సౌకర్యం కల్పించిన విషయాన్ని కక్షిదారులకు తెలియజేయాలని సూచించారు.