శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల వద్ద రోడ్డు ప్రమాదం

శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల వద్ద రోడ్డు ప్రమాదం

MDK: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక టాటా ట్రాలీ ఆటో చెట్టుకు ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.