నేడు సిరికొండలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం

నేడు సిరికొండలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం

NZB: సిరికొండ PHCలో “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉ. 9 నుంచి మ. 2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఇందులో ప్రసూతి, జనరల్ మెడిసిన్, శిశు వైద్యం, కీళ్లు-ఎముకలు, దంత, కంటి వైద్య నిపుణులు అందుబాటులో ఉండి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని వైద్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.