ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌తో మృతి

ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌తో మృతి

BDK: ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు ఇవాళ మృతి చెందిన విషాద ఘటన ఇల్లందు మండలం బొల్లి నగర్లో చోటుచేసుకుంది. తిలక్ నగర్ పంచాయతీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన యాదగిరి, సునీత దంపతుల కుమారుడు సిలివేరి అభిచంద్ర ఇంటర్ చదువుతున్నాడు. ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు.