జాతీయ క్రికెట్ విజేతకి సన్మానం

జాతీయ క్రికెట్ విజేతకి సన్మానం

SKLM: టెక్కలి మండలం పెద్దసానకి చెందిన బధిర క్రికెట్ క్రీడాకారిణి రోహిణి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. హరియాణాలో గత నెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన డెఫ్ టీ 10 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌‌ లో విజేతగా నిలిచిన రాష్ట్ర జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించింది. ఈ మేరకు శుక్రవారం ఆమెను గ్రామస్తులు, బీజేపీ నాయకులు శాలువాతో సత్కరించారు.