ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం

SRCL: భారతరత్న, ఇంజనీరు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా, సిరిసిల్ల జిల్లాలో ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో ఇంజనీర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.