VIDEO: ‘చలో అసెంబ్లీ’ భగ్నం.. ఆశా కార్యకర్తల అరెస్ట్

VIDEO: ‘చలో అసెంబ్లీ’ భగ్నం.. ఆశా కార్యకర్తల అరెస్ట్

KNR: తమ సమస్యల పరిష్కారం కోసం ‘చలో అసెంబ్లీ’కి వెళ్తున్న జిల్లా ఆశా కార్యకర్తలను పోలీసులు రేణికుంట టోల్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేసి వారిని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శాంతియుత నిరసనను అడ్డుకోవడం అన్యాయమంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధకాండతో టోల్‌గేట్ పరిసరాల్లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.