బాలుడు మిస్సింగ్: ఆచూకీ తెలిస్తే చెప్పండి..!
VSP: భీమిలి సమీపంలోని మధురవాడ, రేవల్లపాలెంకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి వై. మౌలిక్ (16) అదృశ్యమయ్యాడు. ప్రశాంత రెసిడెన్స్‌లో ఉంటున్న మౌలిక్ బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బట్టలు సర్దుకొని వెళ్లిపోయాడు. తల్లి శిరీష రాణి ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.