జిల్లాలో పంట నష్టం.. త్వరలో నష్టపరిహారం

KMM: జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చింతకాని, కొణిజర్ల మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పెసర, పత్తి, వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. ఈనెల మొదటి వారంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా సర్వే నిర్వహించి తుది నివేదికను బుధవారం పూర్తి చేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపామని, నష్టపరిహారం చెల్లింపులు చేయటం జరుగుతుందన్నారు.