ఫలితాల్లో గద్వాల విద్యార్థుల మెరుగైన ప్రదర్శన

GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇవాళ విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 91.74 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో నిలిచింది. మొత్తం 7,569 మంది పరీక్షలు రాయగా 6,944 మంది పాసయ్యారు. బాలురు 89.49 శాతం, బాలికలు 93.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల అభివృద్ధిలో ఇది మంచి గుర్తింపు అని పలువురు అధికారులు ప్రశంసించారు.