సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

SRD: సంగారెడ్డి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు గౌడ్ పాల్గొన్నారు.