ప్రముఖ ఆర్థికవేత్తతో సీఎం రేవంత్ భేటీ

ప్రముఖ ఆర్థికవేత్తతో సీఎం రేవంత్ భేటీ

TG: ప్రముఖ ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. జీఎస్టీ వసూళ్లు, విద్యుత్ రంగం, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచేందుకు సుబ్రమణియన్ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఈ భేటీలో దృష్టి సారించారు.