ప్రభుత్వ విప్‌ను కలిసిన LHPS నాయకులు

MHBD: శాసనసభ డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్‌ను లంబాడి హక్కుల పోరాట సంఘం (LHPS) రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వ్యాప్తంగా పలు సమస్యల గురించి, ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి ఆయన రామచంద్ర నాయక్‌కి క్లుప్తంగా వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు చెప్పారు.