పెండ్లిమర్రిలో ఎమ్మెల్యే పుత్తా పర్యటన

KDP: పెండ్లిమర్రి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పగడాలపల్లెలో శుక్రవారం నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా పాల్గొన్నారు. గ్రామ సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలతో మాట్లాడారు. పలువురు ప్రజలు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నేతలు, స్థానికులు, అధికారులు పాల్గొన్నారు.