'సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి'

'సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి'

KNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో బీసీ సభ కోసం ఐదు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు.