మంత్రులకు లోకేష్ కీలక సూచనలు
AP: మంత్రులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. మంత్రులందరూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. ఎన్ని కార్యక్రమాలున్నా ఒకరోజు అందుబాటులో ఉండి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. పార్టీ ముఖ్యం అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. విజ్ఞప్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు.