విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.?

విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.?

NDL: నంది కోట్కూరు పట్టణంలోని BRR నగర్ MPP పాఠశాల విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని PDSU కార్యదర్శి మర్రి స్వామి విమర్శించారు. ఈ విషయాన్ని మండల తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి రూపంలో తెలిపారు. పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారని, మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.