లాడ్జ్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన సీఐ
కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్స్, లాడ్జిల యజమానులు, మేనేజర్లతో సీఐ హనీష్ ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి లాడ్జ్‌కు అధికారిక నోటీసులు అందజేసి, ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జిలలో వసతి పొందుతున్న వ్యక్తుల పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.