సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్

NLR: ఉలవపాడు మండలం కరేడులో జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో 'చలో కరేడు' కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావును ఉలవపాడు హైవే వద్ద పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇండోసోల్‌కు భూములు ఇవ్వడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని సీపీఎం నాయకులు తెలిపారు.