అక్రమ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్, బోయినిపల్లి పోలీసులు సంయుక్త దాడిలో రూ. 1,33,000 విలువగల 253 లీటర్ల మద్యం, ఓ కారును సీజ్ చేశారు. స్థంభంపల్లి గ్రామానికి చెందిన సంతోష్, సుమన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. నంది కమాన్ వైన్స్ వద్ద నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.