జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరీక్ష గది,వృద్ధాప్య వార్డు, పెడియాట్రిక్ వార్డు, ల్యాబొరేటరీ లను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.