రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు

SKLM: పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ ముందు టైరులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రం, గజపతి జిల్లా అంతరసింగి గ్రామానికి చెందిన కే. ఈశ్వరరావు (19)కు తీవ్ర గాయాలు కాగా, సునీల్ కుమార్ (19) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.