బోనమెత్తిన ముథోల్ ఎమ్మెల్యే

NRML: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని భైంసాలో గట్టు మైసమ్మ అమ్మవారి బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా బోనమెత్తి డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి బోనాన్ని సమర్పించి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వీరి వెంట బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు