జిల్లా నూతన కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

కాకినాడ జిల్లా నూతన కలెక్టరుగా ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తమ కార్యాలయ ఛాంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా జిల్లా అధికారులు, వేదపండితుల పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన చరిత్ర, ఎన్నో విశిష్టతలు కలిగిన జిల్లాలో పనిచేయడం తనకు లభించిన అపూర్వ అవకాశమని పేర్కొన్నారు.