ఖిలా వనపర్తి గ్రామ సర్పంచిగా మోతే కనకయ్య
PDPL: ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మోతే కనకయ్య (శ్రీనివాస్) విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయనకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది.