ఘనంగా గోపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

MHBD: జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సంస్థ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తొలుత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు.