రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
WGL: పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు MLA KR నాగరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆత్మపరిశుద్ధి, నియమనిష్ఠలకు ప్రతీక అని, ఉపవాస దీక్షలు మనసుకు నియంత్రణ, జీవనంలో క్రమశిక్షణ, సేవా దృక్పథాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.