VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

BHPL: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి- కాలేశ్వరం ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి కమలాపూర్ క్రాస్ దగ్గర ఎదురెదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూపాలపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్, గణపురం గ్రామానికి చెందిన రెబ్బ శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.