భక్తులతో మర్యాదగా మెలగాలి: శ్రీశైలం సీఐ

KRNL: శ్రీశైలంలో ఉన్న నిత్య అన్నదాన సత్రాల నిర్వాహకులతో శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా స్థానిక సీఐ జీ. ప్రసాదరావు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సత్రాలలో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సత్రాలలో ఎలాంటి తప్పిదాలు జరిగినా నిర్వాహకులదే బాధ్యత అన్నారు. భక్తుల నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేయొద్దని తెలిపాడు.