రెండు మండలాల పాఠశాలలకు సెలవులు

MLG: జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. మంగళవారం భారీ వర్షాలు ఉన్నా నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. మిగతా మండలాల్లో యధావిధిగా పాఠశాలలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.