ఢిల్లీ పంద్రాగస్టు వేడుకల్లో మునగాల బాలుడు

SRPT: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన ప్రధాని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మునగాలకు చెందిన వల్లోజు అశ్విత్ హాజరయ్యారు. రక్షణ శాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో రెండు లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో అశ్విత్ ఒకరు. అశ్విత్ కోదాడ పట్టణంలోని తేజ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నాడు.