అర్థరాత్రి నుంచే ఆరోగ్యశ్రీ సేవలు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ రాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు TANHA అధ్యక్షుడు డా. వద్దిరాజు నిన్న ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి తమకు రూ.1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు చెబుతున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ CEOను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.