పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందజేసిన పోలీసులు

WNP: గోపాల్‌పేట మండలం ఎదుల గ్రామానికి చెందిన నాగరాజు ఆగస్టు 29న తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఈ విషయంపై గోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నరేష్ కుమార్ మార్గదర్శకత్వంలో ASI రామామణి CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను ట్రేస్ చేసి బుధవారం అతనికి అప్పగించారు.