పాలమూరులో పేలుళ్ల కలకలం

పాలమూరులో పేలుళ్ల కలకలం

MBNR: జిల్లాలో పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్ ఉమ్మడి జిల్లాలో క్వారీలు, ప్రాజెక్టుల పనుల్లో ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. భారత్ మాల రోడ్డు నిర్మాణం కోసం గద్వాల జిల్లా గట్టు మండలంలోని గుట్టల్లో నిర్వహిస్తున్న మైనింగ్ పనులను సల్కాపూరం, జోగన్ గట్టు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పేలుడులో కూలీ మృతితో ఈ విషయం వెలుగులో వచ్చాయి.