దళారులను నమ్మి మోసపోవద్దు: సంతోష్ రావు

దళారులను నమ్మి మోసపోవద్దు: సంతోష్ రావు

ADB: రైతులు ద‌ళారుల‌ను న‌మ్మ‌కుండా ప్ర‌భుత్వ కొనుగోలు కేంద్రాల వ‌ద్ద త‌మ శ‌న‌గ పంట‌ను అమ్ముకోవాల‌ని ఆత్మ క‌మిటీ ఛైర్మన్ గిమ్మ సంతోష్ రావు అన్నారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. రైతులు తమ పంటను ఆరబెట్టి, తేమ శాతం లేకుండా తీసుకువచ్చి ప్ర‌భుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు.