VIDEO: 'త్వరలో రాష్ట్ర పండుగగా జగ్గన్న తోట ప్రభల తీర్థం'
కోనసీమ: అంబాజీపేట మండలం మొసలపల్లిలో ప్రతి ఏటా జనవరి నెలలో వైభవంగా జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజోలులో మంగళవారం మంత్రి పర్యటించిన సందర్భంగా ఆయన దృష్టికి కోనసీమ వాసులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు.