రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అల్లూరి: కొయ్యూరు మండలం రామరాజుపాలెం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెదల గణేష్ (25)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వలసంపేటకు చెందిన గణేష్, వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై రామరాజుపాలెం వెళ్లి, తిరిగి వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.