నీటి నుంచి బయటికి వచ్చిన ప్రాచీన ఆలయం..!

నీటి నుంచి బయటికి వచ్చిన ప్రాచీన ఆలయం..!

NGKL: కృష్ణానది బ్యాక్ వాటర్ తగ్గడంతో కొల్లాపూర్ సోమశిలలో సప్తనదుల సంగమ క్షేత్రమైన సంగమేశ్వరాలయం నీటి నుంచి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు తెల్కపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో ఆలయాన్ని పరిశుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. పూర్తిగా దర్శనమిస్తున్న ఈ ప్రాచీన ఆలయానికి రానున్న రోజులలో భక్తుల రద్దీ పెరగనుంది.